రాష్ట్ర స్థాయి టోర్నీకి జిల్లా ఫుట్‌బాల్‌ టీం

Jan 24,2024 00:10
రాష్ట్ర స్థాయి టోర్నీకి జిల్లా ఫుట్‌బాల్‌ టీం

రాష్ట్ర స్థాయి టోర్నీకి జిల్లా ఫుట్‌బాల్‌ టీంప్రజాశక్తి- తిరుపతి సిటీ: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు జిల్లా టీం అర్హత సాధించింది. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మూడు జిల్లాల స్థాయిలో జరిగిన కోరమండల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ల చాంపియన్షిప్‌ని తిరుపతి జిల్లాకు చెందిన సీనియర్‌ ఫుట్‌బాల్‌ టీం రాష్ట్రస్థాయిలో టోర్నీకి అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆ టీంను తిరుపతి జిల్లా క్రీడా అధికారి సయ్యద్‌ సాహెబ్‌, తిరుపతి ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వై.ప్రవీణ్‌, కార్యదర్శి శ్రీధర్‌ అభినందించారు. ఈసందర్భంగా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ప్రవీణ్‌ మాట్లాడుతూ డైనమాస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ చొరవ తీసుకొని తిరుపతి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సహకారంతో మంచి ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్ని తయారు చేయడం అభినందనీయమని, వారు సాధించిన విజయంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుధాకర్‌ కార్యదర్శి ఏ.రెడ్డప్ప, కోచ్‌ వినోద్‌, బివి.రమణ, చంద్రారెడ్డి, మునయ్య, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️