రూ.25.79 కోట్ల విద్యాదీవెన లబ్ది

రూ.25.79 కోట్ల విద్యాదీవెన లబ్ది

రూ.25.79 కోట్ల విద్యాదీవెన లబ్దిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యాదీవెన నాలుగో విడత నిధులను బటన్‌నొక్కి తల్లుల ఖాతాలో జమ చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి రూ.25.79 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్‌ మెగా చెక్కును విద్యార్థులకు అందజేశారు. తల్లులు, విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో జమ అయిన పది రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేనిచో తదుపరి జగనన్న విద్యా దీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలలకు చెల్లిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️