రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి:ఆర్టీవో

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి:ఆర్టీవోప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ అన్నారు. శనివారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీ ద్విచక్ర వాహన ర్యాలీని రాష్ట్ర రవాణా శాఖ సభ్యులు ముత్తంశెట్టి సునీల్‌ చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలు అడిగిన ఖరీదైన వాహనాలను తీసివ్వడంతో పాటు వారికి భద్రత విషయాలను తెలుపుతూనే హెల్మెట్‌ వాడకం అలవాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్లు సుబ్రమణ్యం, కుసుమ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️