విఆర్‌ఎలకు కనీస వేతనాలివ్వాలి :కలెక్టరేట్‌ ముట్టడి

విఆర్‌ఎలకు కనీస వేతనాలివ్వాలి :కలెక్టరేట్‌ ముట్టడి

విఆర్‌ఎలకు కనీస వేతనాలివ్వాలి :కలెక్టరేట్‌ ముట్టడిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కనీస వేతనం ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికలు (విఆర్‌ఎ)లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, గ్రామ పంచాయతీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగభూషణం, రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులందరికీ సమస్యలు తీవ్రమయ్యాయన్నారు. ఏ ఒక్క కార్మికునికి జీతాలు పెంచకపోగా, హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పిన తీర్పులను అమలు చేయడం లేదన్నారు. కనీస వేతనం ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్లౌజులు, మాస్క్‌లు ఇవ్వాలని కోరారు. విఆర్‌ఎల అర్హత బట్టి రిక్రూట్‌మెంట్‌ చేయాలని, బిఎల్‌ఒ డ్యూటీలు రద్దు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌, పి.మునిరాజా, పి.బుజ్జి పాల్గొన్నారు.

➡️