విద్యార్థులకు మరింత చేరువుగా ఎన్‌ఎస్‌ఇ

విద్యార్థులకు మరింత చేరువుగా ఎన్‌ఎస్‌ఇ

విద్యార్థులకు మరింత చేరువుగా ఎన్‌ఎస్‌ఇ ప్రజాశక్తి తిరుపతి సిటీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెగ్మెంట్‌ ఉన్నతి ఫౌండేషన్‌ ద్వారా దేశంలో మొట్టమొదటి లిస్టింగ్‌ వేడుకతో ఒక చారిత్రాత్మక క్షణాన్ని నమోదు చేసి, విద్యార్థులకు మరింత చేరువైందని ఆ సంస్థ సెబీ హోల్‌ టైం మెంబర్‌ అశ్విని భాటిగా తెలిపారు. స్థానికు ఓ ప్రైవేటు హౌటల్‌ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి జాబితా సుమారు రూ. 1.8 కోట్ల నిధుల సమీకరణను చూసింది. ఇది ఎస్జిబిఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ కళాశాలల కు చెందిన 10,000 మంది ఫైనల్‌ ఇయర్‌ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడానికి వీలు కల్పిస్తుందన్నారు. మన సమాజంలో సానుకూల మార్పును సష్టించే సామాజిక వెంచర్‌లను గుర్తించడానికి, మూల్యాంకనం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి పెట్టుబడిదారులకు పారదర్శకమైన, విశ్వసనీయమైన యంత్రాంగాన్ని అందించడం దీని లక్ష్యం’ అన్నారు. చైర్మన్‌, సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అడ్వైజరీ కమిటీ డాక్టర్‌ ఆర్‌ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్‌ ఎస్‌ ఈ ఆఫ్‌ ఇండియా గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌గా మారేలా చూసుకోవడం మనందరి సమిష్టి బాధ్యత’ అన్నారు. ఎన్‌ఎస్‌ఈ ఎండి, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలు గత మూడు దశాబ్దాలుగా మార్కెట్‌లలో సామాన్యుల భాగస్వామ్యం ద్వారా సంపద సష్టి, ఉద్యోగాల సష్టి, మొత్తం ఆర్థిక వద్ధి రూపంలో సామాజిక ప్రభావాన్ని సష్టించాయి. సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌తో, ప్రభావం చాలా రెట్లు పెరగనుంది’ అన్నారు. ఈ సమావేశంలో అమిత్‌ చంద్ర, అజిత్‌ కేసరి పాల్గొన్నారు.

➡️