వేతనాలు పెంచాలని కల్యాణకట్ట క్షురకుల ధర్నా

వేతనాలు పెంచాలని కల్యాణకట్ట క్షురకుల ధర్నా

వేతనాలు పెంచాలని కల్యాణకట్ట క్షురకుల ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ టిటిడి కల్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు జీతాలు పెంచాలని, అక్రమంగా తొలగించిన తొమ్మిది మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ టిటిడి పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, టిటిడి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ టిటిడి పాలకమండలి సమావేశంలో కార్పొరేషన్‌లో కలవని క్షురకులందరికీ 20వేలు వేతనం పెంచారన్నారు. జీతాలు పెంచినందుకు టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐటియు తరపున ధన్యవాదాలు తెలిపారు. తొలగించిన తొమ్మిది మందినీ విధుల్లోకి తీసుకుంటామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళికి భూమన కరుణాకర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా తెలిపారన్నారు. టిటిడి పాలకమండలి సభ్యులు యానాదయ్య కల్యాణకట్టలో పనిచేస్తున్న బార్బర్లను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి ముని రాజా, డి పార్థసారధి రెడ్డి, ఎం గంగులప్పా, ఎన్‌ రఘు, కళ్యాణ కట్ట నాయకులు శ్రీహరి, ప్రసాదుపాల్గొన్నారు.

➡️