వేసిన రోడ్డే వేయడం..పైపై మెరుగులు దిద్దడం..జేబులు నింపుకునే పనిలో కాంట్రాక్టర్లు

వేసిన రోడ్డే వేయడం..పైపై మెరుగులు దిద్దడం..జేబులు నింపుకునే పనిలో కాంట్రాక్టర్లు

వేసిన రోడ్డే వేయడం..పైపై మెరుగులు దిద్దడం..జేబులు నింపుకునే పనిలో కాంట్రాక్టర్లుప్రజాశక్తి – తిరుపతి సిటివేసిన రోడ్డునే మళ్లీ వేయడం… బాగున్న రోడ్డుకి మెరుగులు దిద్దడం వంటి తంతు తిరుపతిలో షరా మామూలయ్యింది. అధికార పార్టీ అనుచరులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఇలాంటి పనులకు తెరదీయడం గమనార్హం. అందుకు నిదర్శనమే స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రి వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు. స్విమ్స్‌ ఆస్పత్రి ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బర్డ్‌ ఆసుపత్రి మీదుగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయ ఆసుపత్రి వరకు తాజాగా అధికారులు తారు రోడ్డు నిర్మాణాన్ని సోమవారం చేపట్టారు. ఈ రోడ్డు ఆరు నెలలకు ముందే నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం ఆ రోడ్డు బాగానే ఉన్నా, దానిపై మళ్లీ కొత్త రోడ్డు వేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో ఉన్న రోడ్డుకు పట్టుమని 20 మీటర్లు దూరంలో ఆంధ్రప్రదేశ్‌ ఔషధాల సరఫరా కేంద్రంకు ఎదురుగా రోడ్డు బాగా పాడైపోయి గుంతల మయం అయింది. దాన్ని బాగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకొని కాంట్రాక్టర్కు లబ్ధిచేకూర్చే పనులు పక్కనపెట్టి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాడైన రోడ్డులు మరమ్మత్తు పూర్తి చేయాలని, వాహనదారులు స్థానికులు కోరుతున్నారు.

➡️