వైసిపిలో ‘గ్రూపుల’ దాడులుబీసీ సెల్‌ నేత హరిబాబుపై దాడి

వైసిపిలో 'గ్రూపుల' దాడులుబీసీ సెల్‌ నేత హరిబాబుపై దాడి

వైసిపిలో ‘గ్రూపుల’ దాడులుబీసీ సెల్‌ నేత హరిబాబుపై దాడిప్రజాశక్తి – కెవిబిపురం ఎన్నికల సమయంలో వైసిపిలో గ్రూపుల దాడులు పెరిగాయి. కెవిబిపురం మండలం పాతపాళెం గ్రామానికి చెందిన బీసీ సెల్‌ మండల కన్వీనర్‌ అగ్రహారం హరిబాబుపై సొంత పార్టీ నేతలు విచక్షణా రహితంగా గురువారం రాత్రి దాడి చేశారని బాధితుడు మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసి తిరుపతిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. పాతపాళెం గ్రామానికిచెందిన హరిబాబు వైఎస్‌ఆర్‌సిపి మండల బీసీ సెల్‌ అధ్యక్షులుగా, ఆదర్శ పాఠశాల కెవిబిపురం ఛైర్మన్‌గా ఉన్నారు. ఎంపిపి మునిలక్ష్మి భర్త నందకుమార్‌ ముఖ్య అనుచరుడిగానూ పేరుంది. అయితే మూడు నెలలుగా ఎంపిపి భర్తతో విభేదించి సొంత అనుచరగణం ఏర్పాటు చేసుకుని, వేరుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపి, ఎంఎల్‌ఎ అబ్యర్థులను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేపట్టానన్నారు. ఎంపిపి భర్త వల్ల పార్టీకి దూరమైన అందరినీ కలుపుకున్నందున తనపై ఉన్న అక్కస్సుతో మండల కన్వీనర్‌ గవర్ల కృష్ణయ్య, నందకుమార్లు వారి ముఖ్య అనుచరుడైన ఓళ్లూరు గ్రామానికి చెందిన జాకీర్‌ హుస్సేన్‌ను ఉసిగొల్పి దాడిచేయించారని వాపోయాడు. మండల నాయకులను విభేదించానన్న అక్కస్సుతో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మీడియాకు తెలిపారు. హరిబాబుపై దాడిజరిగితే ఆయన్ని పరామర్శించలేదని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి నూకతోట రాజేష్‌ను రాగిగుంట వాసులు అడ్డుకున్నారు. అదే మండలానికి చెందిన బీసీ నాయకులు రంగంలోకి దిగి బాధితుని పరామర్శించి, తాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది.

➡️