వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమ ఉద్దీనులుగా అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి వైసిపి అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలబెట్టనుంది. ప్రస్తుతం ఎంపిగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి బదలాయించనున్నట్లు సమాచారం. చిత్తూరు ఎంఎల్‌ఎగా ఉన్న ఆరణి శ్రీనివాసులును మార్చి ఆ స్థానంలో ఎస్‌ఆర్‌పురం మండలానికి చెందిన ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌ విద్యానందరెడ్డిని బరిలో దింపనుంది. ఈ నేపథ్యంలోనే 50వేల మందికి చిత్తూరు నియోజకవర్గంలో సిఎం పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం బట్టలు పంపిణీ చేయనున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు రాజేష్‌ను పోటీలో పెట్టాలని అధిష్టానం యోచిస్తోంది. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పది స్థానాల్లో కొత్త మొహాలు, మార్పులు జరగనున్నాయి.

➡️