శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా మంగళం పరిధిలోని మిట్టగాంధీపురం గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి సహకారంతో స్మశాన వాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంగళం వైసిపి డివిజన్‌ అధ్యక్షులు ప్రళయకావేరి నారాయణరెడ్డి తెలిపారు. బుదవారం మంగళం-శెట్టిపల్లి మార్గంలో స్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గ్రామ పెద్దలు, యువతతో కలసి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దశాబ్దాల కల నెరవేర్చిన చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షుడు భాస్కర్‌, గ్రామ పెద్దలు గురవయ్య, వెంకటముని, బాబు, మణి, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️