శ్రీసిటీ మోండెలెజ్‌ పరిశ్రమ అంబులెన్స్‌ వితరణ

శ్రీసిటీ మోండెలెజ్‌ పరిశ్రమ అంబులెన్స్‌ వితరణ

శ్రీసిటీ మోండెలెజ్‌ పరిశ్రమ అంబులెన్స్‌ వితరణప్రజాశక్తి – వరదయ్యపాలెం శ్రీసిటీలోని క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌, ఓరియో, బోర్న్‌విటా వంటి దిగ్గజ బ్రాండ్‌ల తయారీ పరిశ్రమ మోండెలెజ్‌ ఇండియా, తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) లో భాగంగా శుక్రవారం సూళ్లూరుపేట కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి రూ.30 లక్షల విలువైన అధునాతన వసతులు కలిగిన నూతన అంబులెన్స్‌ను వితరణగా ఇచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డియంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీహరికి మోండెలెజ్‌ ప్లాంట్‌ డైరెక్టర్‌ అమిత్‌ జైన్‌ అధికారికంగా అంబులెన్స్‌ తాళాలను అందజేశారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత చర్యల ద్వారా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను బలోపేతం చేయడంలో తమ కంపెనీ నిబద్ధతను ఇది ధవీకరిస్తుందంటూ ఈ సందర్భంగా అమిత్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కష్ణ చైతన్య, షణ్ముగ పొన్నుసామి సహా మాండెలెజ్‌ కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, శ్రీసిటీ జనరల్‌ మేనేజర్‌ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️