సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్‌చేశారు. ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె తిరుపతి జిల్లాలో జయప్రదం అయ్యింది. తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భారీ నిరసన జరిగింది. జిల్లాలోని 34 మండలాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. రెగ్యులరైజ్‌ చేస్తానని మాట ఇచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికల ముందు ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతూ ఓడ దాటాక బోడి మల్లన్న చందంగా జగన్మోహన్‌రెడ్డి తీరు ఉందన్నారు. సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ, డిఏతో కూడిన వేతనాన్ని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు నిర్ణయించినా రాష్ట్రంలో అమలు చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని గుర్తు చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీని నిర్ణయించాలని, 62 ఏళ్ల కాలానికి పదవీ విరమణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ, సిఐటియు నాయకులు టి.సుబ్రమణ్యం, లక్ష్మి, తిరుపతి జిల్లా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు గండికోట నాగ వెంకటేష్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు మాధవయ్య, ప్రదీప్‌ కుమార్‌, మునికష్ణ, వాసవి, మోహన్‌, ధనపాల్‌, జనార్ధన్‌, లలిత, ప్రసాద్‌, ప్రశాంత్‌, శివ, వేణు, రమణ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.యుటిఎఫ్‌ మద్దతుసమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) నేతలు హాజరై తమ మద్దతును ప్రకటించారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ముత్యాల రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి. నిర్మల, జిల్లా కార్యదర్శి అవనిగడ్డ పద్మజ, బండి మధుసూదన్‌ రెడ్డి, సి. సురేష్‌, మోహన్‌, బాష తదితరులు యుటిఎఫ్‌ అండగా ఉంటుందని సమగ్ర శిక్ష ఉద్యోగులకు భరోసానిచ్చారు.

➡️