సాకారమైన అఖండ శివనామ సంకీర్తన

సాకారమైన అఖండ శివనామ సంకీర్తన

సాకారమైన అఖండ శివనామ సంకీర్తనప్రజాశక్తి-శ్రీకాళహస్తి జానపద వృత్తి కళాకారుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ‘స్వయంభు’ చెంత అఖండ శివనామ సంకీర్తన చేసేందుకు ఆమోదం లభించింది. స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలోని సాంస్కతిక కళావేదికపై గురువారం జానపద వత్తి కళాకారుల అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకరస్వామి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి జిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తిరుమల తరహాలో ముక్కంటి చెంత అఖండ శివనామ సంకీర్తన జరపాలంటూ ఏడాది పాటు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. వీరికి తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి సంపూర్ణ మద్దతు తెలిపి పోరాటం ముందుకెళ్లేందుకు సహకరించారు. దీంతో అఖండ శివనామ సంకీర్తన చేసేందుకు ఆలయం అనుమతినిచ్చింది. ఆ మేరకు తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన జానపద వృత్తి కళాకారులు శివనామస్మరణలతో సాంస్కతిక కళావేదికను హౌరెత్తించారు. జానపద వత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు మురళి, జిల్లా కన్వీనర్‌ సంక్రాంతి వెంకటయ్య, గెడి వేణు తదితరులు పాల్గొన్నారు.

➡️