సార్వత్రిక ఎన్నికల నోడల్‌ అధికారులవిధులను సమర్థవంతంగా నిర్వహించాలి

సార్వత్రిక ఎన్నికల నోడల్‌ అధికారులవిధులను సమర్థవంతంగా నిర్వహించాలి

సార్వత్రిక ఎన్నికల నోడల్‌ అధికారులవిధులను సమర్థవంతంగా నిర్వహించాలి ప్రజాశక్తి- తిరుపతి సిటీ, తిరుపతి టౌన్‌: సార్వత్రిక ఎన్నికలు- 2024కు షెడ్యుల్‌ విడుదలైన నేపథ్యంలో నోడల్‌ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు- 2024 నిర్వహణ విధులు కేటాయించబడిన నోడల్‌ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో నోడల్‌ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై ఒక పక్కా ప్రణాళికతో అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇందుకొరకు వారికి కేటాయించిన సంబంధిత అంశంపై పీపీటి తయారీతో ఏర్పాట్లు సన్నద్ధతగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు కావలసిన సిబ్బంది కేటాయింపు మ్యాన్‌ పవర్‌ నోడల్‌ అధికారి, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి ఇంతవరకు ఇచ్చిన వాటిపై నివేదిక , మెటీరియల్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ, స్వీప్‌, లాఅండ్‌ ఆర్డర్‌, ఈవిఎం, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఎక్ష్పెండిచర్‌, బ్యాలెట్‌ పేపర్స్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, మీడియా, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, ఎలెక్టోరల్‌ రోల్స్‌, ఓటరు హెల్ప్‌ లైన్‌, అబ్జర్వర్స్‌, మీడియా, సక్షం నోడల్‌ అధికారి తదితర విభాగాలలో నోడల్‌ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల హ్యాండ్‌ బుక్‌ మేరకు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ పెంచల కిషోర్‌, ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్‌ ఆఫీసర్లు, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️