‘స్వచ్ఛత’లో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు

'స్వచ్ఛత'లో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు

‘స్వచ్ఛత’లో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుప్రజాశక్తి -రేణిగుంట : బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో సాఫ్ట్‌వేరు ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్న యువ ఇంజనీర్లు సంక్రాంతి సెలవులు సందర్భంగా తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. రేణిగుంట మండలం ఆర్‌ మల్లవరం పంచాయతీ గ్రామానికి చెందిన యువ సాఫ్ట్‌వేరు ఇంజనీర్లు బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామంలో కుటుంబ సభ్యులతో ఆనం దంగా పండుగ సంబరాలను జరుపు కోవాలని గ్రామానికి చేరుకున్నారు. కానీ ఆర్‌ మల్లవరం నుంచి ఎస్సీపురం వరకు రెండు కిలోమీటర్లు రోడ్డుకి ఇరు వైపులా పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మందు బాటిళ్లు దర్శనమిచ్చాయి. ఇవి చూసిన యువ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్లు నడుం బిగించారు. గ్రామాల్లో వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించి సుమారు రెండు కిలోమీటర్లు ఆర్‌ మల్లవరం నుంచి ఎస్వీపురం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు ప్లాస్టిక్‌ వ్యర్ధాలు, ఖాళీ సీసాలు తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో యువ ఇంజనీర్లు జగన్మోహన్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడి,్డ మోహన్‌ రెడ్డి, జయ కుమార్‌ రెడ్డి, కోహిత్‌ రెడ్డి, కౌశిక్‌ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం కషి చేసిన యువకులను గ్రామ పెద్దలు సుబ్రమణ్యం రెడి,్డ మహదేవరెడ్డి అభినందించారు.

➡️