స్వామిసేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

Dec 21,2023 22:40
స్వామిసేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

ప్రజాశక్తి- చౌడేపల్లి: మండల కేంద్రమైన చౌడేపల్లిలోని అభీష్టద మత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకట నారాయణబట్టి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్‌ దీక్షితులు కుమారస్వామి, మహేష్‌ స్వామిలు న్యాయమూర్తి దంపతులు కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. సింగిల్‌ విండో మాజీ ఉపాధ్యక్షుడు కడియాల రాజన్న, కడియాల మహేష్‌ బాబు రఘు స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️