హామీలు నెరవేరే దాకా సమ్మె సా..గుతుందిశ్రీ రెండో రోజుకు అంగన్వాడీల సమ్మెశ్రీ మద్దతు తెలిపిన టిడిపి, జనసేన

హామీలు నెరవేరే దాకా సమ్మె సా..గుతుందిశ్రీ రెండో రోజుకు అంగన్వాడీల సమ్మెశ్రీ మద్దతు తెలిపిన టిడిపి, జనసేన

హామీలు నెరవేరే దాకా సమ్మె సా..గుతుందిశ్రీ రెండో రోజుకు అంగన్వాడీల సమ్మెశ్రీ మద్దతు తెలిపిన టిడిపి, జనసేనప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రెండోరోజు సమ్మెను కొనసాగించారు. ఈకార్యక్రమానికి సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే.వేణుగోపాల్‌ అధ్యక్షత వహించారు. అంగన్వాడి దీక్షలు టిడిపి, జనసేన మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి మాజీఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి సమ్మె శిబిరానికి వచ్చి సంఘీభావాన్ని తెలిపారు. జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని అంగన్వాడీల సమస్యలను పవన్‌కళ్యాణ్‌ దష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, సమస్య పరిష్కారానికి కషి చేస్తామని తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మీ మాట్లాడుతూ అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతాలు పెంచుతాను అన్న ముఖ్యమంత్రి హామీని నీటి మీద వార్తలుగా మిగిలిందని పరిష్కారానికి మహిళలందరూ అంగన్వాడికి మహిళా సంఘం చేస్తామని కచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి తోడు మేము ఉంటామని హామీ ఇచ్చారు. యుటిఎఫ్‌ జిల్లా నాయకురాలు డి.నిర్మల మాట్లాడుతూ అంగన్వాడీలు పోరాడుతున్న తీరు దర్శించదగ్గ విధంగా ఉందని అంగన్వాడీల పోరాడుతున్న విధానాన్ని చూసి ఎంతోమంది మీ పోరాటస్ఫూర్తిని తీసుకొని పోరాడే విధంగా మీరు చేస్తున్న పోరాటానికి ధన్యవాదాలు తెలిపారు. సిఐటియు నాయకులు పి.బుజ్జి, తంజావూరు మురళి, వాసు అంగన్వాడీలు నాగరాజమ్మ, జయప్రభ, అమర, హేమలత, వరలక్ష్మి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకిచ్చిన హామీలన్నీ నెరవేరే దాకా నిరవధిక సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. స్థానిక శ్రీకాళహస్తి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్‌టియు అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా టిడిపి, జనసేన నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి సతీమణి బొజ్జల బందమ్మ మాట్లాడుతూ అధికారాన్ని చేపట్టేందుకు ప్రతిపక్ష నేతగా అంగన్వాడిల్లో ఆశలు రేకెత్తించిన జగన్‌ తీరా గద్దెనెక్కాక మాట తప్పడం- మడమ తిప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలను సముదాయించి హామీలను నెరవేర్చేందుకు చొరవ చూపాల్సిన జగన్‌ సర్కార్‌ సమ్మె విరమించకుంటే ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం సత్వరచర్యలు చేపట్టాలని కోరారు. జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్‌, టిడిపి మహిళా విభాగం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు చక్రాల ఉష, ఉమేష్‌ రావు, సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, రాపూరు సుబ్రమణ్యం, సంక్రాంతి వెంకటయ్య, రేవతి, భారతీ పాల్గొన్నారు. గూడూరు టౌన్‌: గుడూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రెండో రోజు సమ్మెను కొనసాగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిచండం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యూనియన్‌ అధ్యక్షులు ఏ.ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్‌. ప్రభావతి, సెక్టార్‌ లెటర్స్‌ జె.లక్ష్మీ, ఎస్‌కె ఆసియా, కుమారి, మంగమ్మ పాల్గొన్నారు. పిచ్చాటూరు: రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు భయపడమని అంగన్వాడీలు హెచ్చరించారు. స్థానిక సిడిపిఓ కార్యాలయం ఎదుట బుధవారం రెండో రోజు సమ్మెను కొనసాగించారు. వీరికి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగలాపురం నాగరాజు, జె.రామచంద్రారెడ్డిలు మద్దతు తెలిపారు. యూనియన్‌ సిఐటియు జిల్లా కోశాధికారి రాజేశ్వరి, ప్రాజెక్టు నాయకురాలు ఇంద్రాణి, అంగన్వాడీలు పాల్గొన్నారు.రేణిగుంట: అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఈ సమ్మె ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, అంగన్వాడీజిల్లా గౌరవాధ్యక్షులు ప్రసాదరావు హెచ్చరించారు. 2వ రోజు సమ్మెను రేణిగుంట మంచినీళ్లు గుంట పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద కొనసాగించారు. సిఐటియు మండల కార్యదర్శి కె.హరినాథ్‌, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ, ఐఎఫ్‌టియు కార్యాదర్శి రాధ, అంగన్వాడీలు పాల్గొన్నారు.నాయుడుపేట: నాయుడుపేటలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రెండోరోజు కొనసాగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు సమ్మె శిబిరాన్నికి చేరుకుని అంగన్వాడీలకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయన వెంటన సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్వాడీలు శ్యామలమ్మ, చంద్రకళ, సిహెచ్‌ మేరి, నాగరత్నమ్మ పాల్గొన్నారు.సూళ్లూరుపేట: సూళ్ళూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాల్లో అంగన్వాడీల సమ్మెకు సిపిఎం నాయకులు బి.పద్మనాభయ్య, తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు సుంకర అల్లెయ్య, సిఐటియు నాయకులు మనోహరం, యుటిఎఫ్‌ నాయకులు రాజశేఖర్‌, రాము మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో అంగన్వాడీల సమ్మె రెండో రోజైన బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట కొనసాగింది. యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రమీలమ్మ, సుదర్శనలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్‌ పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పుత్తూరు టౌన్‌: అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానని నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన తరువాత వారు సమ్మె చేసే పరిస్థితికి తీసుకురావడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాస్‌ విమర్శించారు. రెండో రోజు అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు గంజి మాధవయ్య, పట్టణ, రూరల్‌ అధ్యక్షులు జి.జీవరత్నం నాయుడు, డి.రవికుమార్‌ సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, ఏఐటియుసి కార్యదర్శి డి.మహేష్‌, సెల్వరాజ్‌ ఆచారి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️