రపు యుపిఎస్‌సి ప్రిలిమ్స్‌ పరీక్ష తిరుపతి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలుహాజరు కానున్న 5518 మంది అభ్యర్థులు

రపు యుపిఎస్‌సి ప్రిలిమ్స్‌ పరీక్ష తిరుపతి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలుహాజరు కానున్న 5518 మంది అభ్యర్థులు

రపు యుపిఎస్‌సి ప్రిలిమ్స్‌ పరీక్ష తిరుపతి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలుహాజరు కానున్న 5518 మంది అభ్యర్థులుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఈ నెల 16న ఆదివారం యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ విసి హాల్‌ నందు ఈ నెల 16 న జరగనున్న యు.పి.ఎస్‌.సి. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణపై సంబందిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకొరకు 11 మంది లోకల్‌ ఇన్స్పెక్టింగ్‌ అధికారి(తహశీల్దార్‌), 11 చీఫ్‌ సూపరింటెండెట్స్‌, ఐదుగురు జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అబ్జర్వర్‌ గా వ్యవహరిస్తారని , తిరుపతి ఆర్‌.డి.ఓ. పరీక్ష పేపర్ల కస్టోడియన్‌ గా వ్యవహరించనున్నారని. తిరుపతి ఆర్‌.డి.ఓ. కార్యాలయంలో ఈ నెల 15, 16 తేదీలలో కంట్రోల్‌ రూమ్‌ నెం 9000665565, 9676928804 లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 9.30-11.30మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 మధ్య పరీక్ష జరుగుతుందని తెలిపారు. 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌ పాల్గొన్నారు.

➡️