మాట తప్పారు… మడమ తిప్పారు..!అనుప్పల్లి రైతుల ఆవేదనడికెటి భూములకు పట్టాలిస్తామన్నారుసిఎం జగన్‌ హామీ ఇచ్చి 75 నెలలు

మాట తప్పారు... మడమ తిప్పారు..!అనుప్పల్లి రైతుల ఆవేదనడికెటి భూములకు పట్టాలిస్తామన్నారుసిఎం జగన్‌ హామీ ఇచ్చి 75 నెలలు

మాట తప్పారు… మడమ తిప్పారు..!అనుప్పల్లి రైతుల ఆవేదనడికెటి భూములకు పట్టాలిస్తామన్నారుసిఎం జగన్‌ హామీ ఇచ్చి 75 నెలలుప్రజాశక్తి – రామచంద్రాపురం ‘సిఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారు.. మడమ తిప్పారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే డికెటి భూములకు పట్టాలిస్తామని నమ్మబలికారు.. హామీ ఇచ్చి 75 నెలలయ్యింది.. అతీగతీ లేదు..’ అని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి రైతులు 200 మంది వాపోతున్నారు. మళ్లీ ఎన్నికలంటూ ఓటేయాలంటూ తమ వద్దకు వస్తున్నారని, హామీ నెరవేర్చకుండా ఓటేలా వేయాలన్నది వారి వాదన. వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ నెమ్మళ్లగుంటపల్లి గ్రామంలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 2018, జనవరి 10న రైతు సదస్సుకు విచ్చేశారు. టిడిపి ప్రభుత్వంలో ప్రజల వద్దకు పాలనలోనూ, కాంగ్రెస్‌ హయాంలోనూ భూపంపిణీ కార్యక్రమంలో అనుప్పల్లి రెవెన్యూ లెక్క దాఖలాలోని ప్రభుత్వ భూములను పేదలకు విడతల వారీగా దరఖాస్తు పట్టాలను మంజూరు చేశాయి. సర్వే నంబర్‌ 411 నుండి 493 సర్వే నంబర్‌ వరకూ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఛాయాచిత్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. అసైన్మెంట్‌ కమిటీ ఆమోదం లేదన్న కారణంగా అప్పటి చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్‌ కోదండ రామిరెడ్డి విచారించి దరఖాస్తు పట్టాలను రద్దు చేయాలని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఆ సందర్భంగా అనుప్పల్లి పంచాయతీలోని 200 మంది రైతులకు సంబంధించిన 300 ఎకరాల డికెటి భూములను ఆర్‌ఒసి నంబర్‌ ఈ4/1308/2017 తేదీ22 /8/2017 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న రద్దు చేశారు.దీంతో ఆగ్రహించిన రైతులు రైతు సదస్సుకు విచ్చేసిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అనుప్పల్లి పంచాయతీలో రద్దయిన డికెటి భూములనున రైతులకు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇచ్చి ఇప్పటికి అక్షరాలా 75 నెలలు. అప్పట్లో ఎన్నికలయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి సిఎం అయ్యారు. మళ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు విచ్చేశారు. హామీ మాత్రం అలాగే ఉండిపోయింది. కాంగ్రెస్‌ హయాంలో పేద రైతులకు పట్టా పాస్‌బుక్‌ ఇచ్చింది. మామిడి, వేరుశనగ, కంది, ఉలవ పంటలను సాగుచేసుకున్నారు. ఈ భూములపై బ్యాంకుల్లో పంట రుణాలు పొందారు. అయితే డికెటి భూములను రద్దు చేయడంతో ఆన్‌లైన్‌లో పట్టాదారు పేరుపై ఉన్న భూమి వివరాలను రెవెన్యూ అధికారులు తొలగించేశారు. ప్రస్తుతం తీసుకున్న అప్పు రెన్యువల్‌ చేసుకోలేక, రుణాన్ని బ్యాంకులకు సకాలంలో కట్టలేక ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇచ్చి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. దీంతో కొంతమంది అప్పు తెచ్చి రుణాలను చెల్లించారు. జగనన్న మాట నమ్మినందుకు అప్పుల ఊబి మిగిలిందని వారు మీడియాతో వాపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎంఎల్‌ఎ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. డికెటి భూముల సమస్యను పరిష్కరిస్తా పులివర్తి నాని, టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి అనుప్పల్లి పంచాయతీలో డికెటి భూముల సమస్యను టిడిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పరిష్కరించి, రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, దరఖాస్తు పట్టాలను ఇప్పిస్తాను. 200 మంది రైతులకు న్యాయం చేస్తాను. సిఎం జగన్‌ మోసం చేశాడు :బి.మోహన, అనుప్పల్లి నేను పేద మహిళను. కాంగ్రెస్‌ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నా పేరున 1.50 సెంట్లు ప్రభుత్వ భూమికి పట్టా మంజూరు చేశారు. మామిడి చెట్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నా. ప్రజాసంకల్ప యాత్రలో రద్దయిన డికెటి భూమిని తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆరేళ్లయ్యింది. న్యాయం చేయలేదు. రైతుల గోడు పట్టించుకోలేదు : విసనగిరి లక్ష్మమ్మ నాకు టిడిపి హయాంలో అనుప్పల్లి లెక్క దాఖలాలో సర్వే నంబర్‌ 413, 414లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి డికెటి పట్టా ఇచ్చారు. మామిడి చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మా భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. పట్టించుకోలేదు. తండ్రి ఇచ్చిన భూములకే దిక్కులేదు : కె.చంద్రశేఖర్‌రెడ్డి, రైతు భూపంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నపుడు నా భార్య కె.ధనలక్ష్మి పేరుతో అనుప్పల్లి లెక్కదాఖలాలో 488/4 సర్వే నంబర్‌లో ఎకరా భూమికి డికెటి పట్టా ఇచ్చారు. ఆ భూమిలో మామిడి చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పారు. తండ్రి ఇచ్చిన భూములకు న్యాయం చేయలేదు.

➡️