9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగుదేశం పార్టీకి అప్పటి ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి చంద్రబాబునాయుడు వరకూ ఎన్నికల శంఖారావం తిరుమల శ్రీవారి చెంతే పూరిస్తారు. ఈ నేపథ్యంలో జనవరి 9న టిడిపి, జనసేన ఉమ్మడి శంఖారావం పూరించనున్నాయి. జనసేన, టిడిపి మధ్య కుదుర్చుకున్న అభ్యర్థుల ఒప్పందాన్ని ప్రకటించనున్నారు. తిరుపతి నుంచి జనసేన నేత పవన్‌కల్యాణ్‌ పోటీలో ఉంటారని చర్చ నడుస్తోంది. అలాగే మదనపల్లి నుంచి గంగారపు రాందాస్‌ బరిలో నిలవనున్నారు. కుప్పం నుంచి నారా చంద్రబాబునాయుడు తెలిసిందే. పలమనేరు నుంచి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, పూతలపట్టు నుంచి మురళీక్రిష్ణ, చంద్రగిరి నుంచి పులివర్తినాని, జీడీనెల్లూరు నుంచి డాక్టర్‌ థామస్‌, సత్యవేడు నుంచి జెడ్డా రాజశేఖర్‌ ఆశించినప్పటికీ సినీ యాక్టర్‌కు ఇవ్వనున్నారు. పీలేరులో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి, పుంగనూరులో రామచంద్ర యాదవ్‌ (పొత్తు) లేకుంటే చల్లా రామచంద్రారెడ్డిలకు ఇస్తారని చర్చ నడుస్తోంది. సూళ్లూరుపేటలో మాజీ ఎంపి నెలవల సుబ్రమణ్యం, పరసారత్నం మీద పోటీ ఉంది. గూడూరు నుంచి మాజీ ఎంఎల్‌ఎ సునీల్‌కుమార్‌ను పోటీలో పెట్టే యోచన ఉంది. వెంకటగిరి నుంచి రామక్రిష్ణరెడ్డి బరిలో నిలవనున్నారు. ఏదిఏమైనప్పటికీ జనవరి 9 నాటికి ఉమ్మడి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉంది.

➡️