ఘనంగా ట్రైలర్స్ దినోత్సవ ర్యాలీ

Feb 28,2024 17:01 #Tirupati district

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ వినాయక సొసైటీ మరియు మహిళా టైలర్స్ వెల్ఫేర్. అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పట్టణ పురవీధులలో టైలర్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండి వీధిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుత్తూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో టైలర్స్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మిగ్ద మహిళ వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు పంచిపెట్టి ,వస్త్ర దానం, అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యక్తులు హుందాగా కనపడాలంటే టైలర్స్ శ్రమ ఎంతో ఉందని, బట్టల, సౌందర్యాలను వెలికి తీసేది టైలర్స్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు భాస్కర్, మహిళా టైలర్స్ అధ్యక్షురాలు నాగరత్న, గణేష్, రాజేంద్ర సూరి వెంకటముని చిన్నబ్బ, రజని, పుష్పలత, లక్ష్మి, శైలజ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️