వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలుపట్టు వస్త్రాల సమర్పణ

వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలుపట్టు వస్త్రాల సమర్పణప్రజాశక్తి- రామచంద్రపురం తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంట గ్రామంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతం నిర్వహించాక శుద్ధి నిర్వహించారు. ఆతర్వాత ఉదయం 6గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయం ధ్వజస్తంభం చుట్టూ తిరిగి ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పంచాగ శ్రవణం చేశారు. ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

➡️