కుంటి సాకులతో అంబేద్కర్‌ స్టడీ సర్కిళ్ల మూసివేతసత్యవేడు, ఎస్పీడబ్లూ కేంద్రాలు తొలగింపుసర్క్యులర్‌ జారీ చేసిన అధికారులుఅడ్మిషన్లు తక్కువ ఉన్నాయంటూ మెలిక

కుంటి సాకులతో అంబేద్కర్‌ స్టడీ సర్కిళ్ల మూసివేతసత్యవేడు, ఎస్పీడబ్లూ కేంద్రాలు తొలగింపుసర్క్యులర్‌ జారీ చేసిన అధికారులుఅడ్మిషన్లు తక్కువ ఉన్నాయంటూ మెలిక

కుంటి సాకులతో అంబేద్కర్‌ స్టడీ సర్కిళ్ల మూసివేతసత్యవేడు, ఎస్పీడబ్లూ కేంద్రాలు తొలగింపుసర్క్యులర్‌ జారీ చేసిన అధికారులుఅడ్మిషన్లు తక్కువ ఉన్నాయంటూ మెలికప్రజాశక్తి- తిరుపతిచదువుకోవాలనే కోరిక వుండి… ఏవేని కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటమే ధ్యేయంగా ఏర్పడ్డ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్లను కుంటి సాకులతో వదిలించుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పిల్లలందరికీ నిర్బంధ విద్య, అందరికీ ఉన్నత విద్య అందించడమే తమ ప్రభుత్వాల లక్ష్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇలా అడ్మిషన్లు తక్కువ ఉన్నాయని కుంటి సాకులు చెబుతూ పేద మధ్యతరగతి వర్గాల వారికి ఉన్నత విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 9 కేంద్రాల్లో విస్తతంగా సేవలందించిన స్టడీ సెంటర్లను క్రమేపి కుదిస్తూ వస్తున్నారు. తాజాగా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు అయిన సెంటర్‌ తో పాటు, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆవరణలోని విద్యా కేంద్రాలలో రద్దు చేసేందుకు యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. గత నాలుగేళ్ళ క్రితం ఇదే తరహాలో పీలేరు కేంద్రాన్ని తొలగించింది. ఇప్పుడు మళ్లీ రెండు కేంద్రాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తుండటం గమనార్హం.దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిందే డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయము. పూర్వం ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబదుతున్న ఈ వర్సిటీ 1982 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో సేవలందిస్తోంది. దీనికి 218 విద్యాకేంద్రాలు , 23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, పిజి కేంద్రాలు ఉన్నాయి. గత నాలుగు దశాబ్దాల క్రితం తిరుపతిలో రీజనల్‌ సెంటర్‌ గా ప్రారంభమైనప్పటికీ, అనతి కాలంలోనే చిత్తూరు, పుత్తూరు, కుప్పం, మదనపల్లి, పలమనేరు, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి ప్రాంతాలలో స్టడీ సెంటర్లను ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 30 వేల మందికి పైగా ఉన్నత విద్యను అందించింది. ఈ స్టడీ సెంటర్లలో చదువుకున్న పేద, మధ్యతరగతి వర్గాల అభ్యర్థులు నేడు అనేకానేక ఉన్నత స్థానాల్లోనూ ఉన్నట్లు వర్సిటీ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే అంతటి ప్రాశస్థ్యం ఉన్న స్టడీ సెంటర్ల నిర్వహణ తమకు భారమైందనే కుంటి సాకులు చెబుతూ తొలగిస్తుండడం గమనార్హం.సర్క్యులర్‌ ఇచ్చిన మాట వాస్తవమే కళ్యాణి, తిరుపతి ప్రాంతీయ సమన్వయ కేంద్రంఅంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీతిరుపతి పద్మావతి యూనివర్సిటీలోని స్టడీ సెంటర్‌ తో పాటు, సత్యవేడు విద్యా కేంద్రాన్ని తొలగించాలని వర్సిటీ యాజమాన్యం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే సర్క్యులర్లను జారీ చేసిన మాట వాస్తవమే. అయితే ఇంకా ఆ సెంటర్లను రద్దు పరచలేదు. నిర్వహణ భారం, అక్కడ అడ్మిషన్లు రోజురోజుకీ తగ్గిపోతుందటం తోనే వర్శిటీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.

➡️