ఎన్నికల పరిశీలకుల నియామకం

ఎన్నికల పరిశీలకుల నియామకంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ జిల్లాలోని ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్‌లను నియమించింది. చిత్తూరు (ఎస్సీ) పార్లమెంటు నియోజకవర్గం అబ్జర్వర్‌గా శంకర్‌ ప్రసాద్‌ శర్మ, నగరి, జి.డి.నెల్లూరు(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్‌ అబ్జర్వర్‌గా కైలాశ్‌ వాంఖడే, చిత్తూరు, పూతలపట్టు(ఎస్సీ), పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్‌ అబ్జర్వర్‌ ఎం.డి షాధిక్‌ అలం, పుంగనూరు, నగరి, జి.డి నెల్లూరు (ఎస్‌.సి) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండీచర్‌ అబ్జర్వర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ ఖన్నా, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండీచర్‌ అబ్జర్వర్‌ రోహన్‌ ఠాఖుర్‌, నగరి, జి.డి నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీస్‌ అబ్జర్వర్‌గా అరవింద్‌ హెచ్‌ సాల్వే నియమితులైయ్యారు.

➡️