ఏపి ఆర్‌ సెట్‌ ఫలితాలు విడుదల

May 22,2024 21:58
ఏపి ఆర్‌ సెట్‌ ఫలితాలు విడుదల

ప్రజాశక్తి- క్యాంపస్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపిఆర్‌ సెట్‌ 2023-24ను మే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన విషయం విధితమే. ఈ సెట్‌ ఫలితాలను బుధవారం 3 గంటలకు ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విసి ఆచార్య వి.శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపి ఆర్‌ సెట్‌ – 2023-24 మొత్తం 64 సబ్జెక్టులలో నిర్వహించడం జరిగిందని, మ్నెత్తం 10050 మంది దరఖాస్తు చేసుకోగా 8651 మంది హాజరయ్యారని వారిలో 4352 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వీరిలో పురుషులు 2226 , స్త్రీలు 2126 వున్నారని తెలిపారు. ఎస్వీయూకు రీసెట్‌ 2023-24 నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ఉన్నత విద్యామండలి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజయవంతంగా సెట్‌ నిర్వహణ చేసిన కన్వీనర్‌ ఆచార్య దేవప్రసాద్‌ రాజును అభినందించారు. ఏపి ఆర్‌ సెట్‌ – 2023-24 కన్వీనర్‌ ఆచార్య దేవప్రసాద రాజు మాట్లాడుతూ వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా వున్న 2728 పిహెచ్‌డి సీట్లకుగాను ఏపిఆర్‌ సెట్‌-2023-24 నిర్వహించామని, ఎంట్రన్స్‌ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు జూన్‌ 10 తర్వాత ఇంటర్యూలు నిర్వహించి ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు. ఫలితాలను ష్ట్ర్‌్‌జూర://షవ్‌ర.aజూరషష్ట్రవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబిసైట్లో చూడవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య కిశోర్‌, ఆచార్య కుమారస్వామి, ఆచార్య కుసుమ హరినాథ్‌, కామేష్‌, నాగభూషణం, సుకుమార్‌, సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️