కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి : ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌

కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి : ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) గతంలో తిరుపతి ఎంఎల్‌ఎ స్థానం ఎన్నికల కౌంటింగ్‌ రోజు టిడిపి అభ్యర్థి సుగుణమ్మ గెలిచిందనుకుంటున్నా, చివరి ఘడియల్లో వైసిపి గెలిచినట్లు ప్రకటించడం వెనుక లోగుట్టు పెరుమాళ్లకెరుక అని కాపుసేన నాయకులు ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ అన్నారు. ఈసారి కౌంటింగ్‌ రోజు ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈసారి కూటమి గెలుపు ఖాయమన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బెల్లంకొండ సురేష్‌, బండ్ల లక్ష్మీపతి, నీలాద్రి, గుండాల వేణు, రఘురాయల్‌ పాల్గొన్నారు.

➡️