అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి 

Feb 9,2024 16:56 #Tirupati district
asha workers protest in guduru

ప్రజాశక్తి-గూడూరు : తిరుపతి జిల్లా గూడూరులో శుక్రవారం రోజు రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు ఆశ వర్కర్ల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను సి.ఐ.టి.యు నాయకత్వాన్ని అన్యాయంగా అక్రమంగా పోలీసులు అరెస్టులు, నిర్బంధాన్ని, అక్రమంగా అరెస్టు చేసిన, “ఆశా వర్కర్ల నాయకులను వెంటనే విడుదల చేయాలని”, ప్రభుత్వం మొండి వైకిరిని నిరసిస్తూ తిరుపతి జిల్లా గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి ఆర్డిఓ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు కనీస వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశాలుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు,మెడికల్ లీవు వేతనంతో కూడిన వెటర్నిటీ లీవ్ అమలు చేయాలని, సంబంధం లేను పనులు చేయించరాదని, నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు కల్పించాలని, (ఏ కారణంతో మరణించిన) వారికి మట్టి ఖర్చులు అమలు చేయాలని, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ జీ.ఒ.ను వర్తింపజేయాలని, రిటైర్మెంట్ అయిన వారు మరియు మరణించిన కుటుంబాలలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయాలని, కోవిడ్ కాలంలో (2020 మార్చి నుండి) మరణించిన ఆశాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, రూరల్ లో 1000-1200, పట్టణాలు 2000-2500 జనాభా కు, ఒకరు చొప్పున నియమించాలని, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, నియామకాలు ప్రభుత్వం చేపట్టాలి, రాజకీయ జోక్యం తొలగించాలని, ఆశాలకు ఏ.ఎన్.ఎం. ట్రైనింగ్ ఇవ్వాలని, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను ఆర్డిఓ యం.కిరణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు ఆశా వర్కర్ల అధ్యక్షరాలు పి. చెం గాలమ్మ, కార్యదర్శి కె.జానకి, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.ఉష, జిల్లా సహాయ కార్యదర్శి బి.కృష్ణవేణి, సి.పి.ఎం. నాయకులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు పట్టణ అధ్యక్షులు బి.వి.రమణయ్య, కార్యదర్శి యస్.సురేష్, పామంజి మణి, ఏ. ప్రసాద్, బి.చంద్రయ్య, గుర్రం రమనయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️