ఆశ వర్కర్ల నిరసన ర్యాలీ

Feb 9,2024 16:15 #Tirupati district
asha workers protest in tpt

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : ఆశ వర్కర్లు నిరసన ర్యాలీని సూళ్లూరుపేట సిఐటియు కార్యాలయం నుండి బస్టాండ్ వరకు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్‌ని ఆశాలుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, వెటర్నటీ లీవులు అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, మరణించిన వారికి ఖర్చులు చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని 62 సంవత్సరాలకు రిటైర్‌మెంట్‌ వర్తింప చేయాలని, మరణించిన, రిటైర్‌ అయిన కుటుంబాల్లో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమపథకాలు అమలు చేయాలని, కొవిడ్‌ కాలంలో మరణించిన ఆశాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలని, ఖాళీపోస్టులు భర్తీ చేయాలని గురువారం తలపెట్టిన మహాధర్నాని ప్రభుత్వము అనేక ఆంక్షలు విధించి నాయకురాళ్ళను గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేసి చేశారు. ఈ అరాచకాన్ని నిరసిస్తూ దొరవారిసత్రం తడ సూళ్లూరుపేట మండల ఆశా కార్మికులు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చి, నిర్బంధాలను ఖండించారు. తమ డిమాండ్లను తీర్చకపోతే మరింతగా ఉద్యమం ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఆశా కార్మికుల అధ్యక్షులు లక్ష్మీ ,సిఐటియు కార్యదర్శి కె.లక్ష్మయ్య,పి.మనోహర్ కరీం భాయ్ తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️