ప్రతిపక్షాలపై దాడులు మంచిది కాదు : సిపిఐ

ప్రతిపక్షాలపై దాడులు మంచిది కాదు : సిపిఐ ప్రజాశక్తి-తిరుపతి సిటి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయడం మంచిది కాదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి సంయుక్తంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ద్వారా 164 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. అయితే వైఎస్‌ఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలను, గెలవని ఎమ్మెల్యేల పైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేయడం, దాడులు చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. తాజాగా పుంగనూరు ఎంఎల్‌ఎ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలన్నారు.వైఎస్‌ఆర్‌ పార్టీ అలా చేయడం వల్లనే 11 సీట్లకే పరిమితమయ్యిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

➡️