హర్షవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం

హర్షవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం

హర్షవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం ప్రజాశక్తి – క్యాంపస్‌ ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ) విభాగం పరిశోధక విద్యార్థి కె. హర్షవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు వర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ) విభాగం ఆచార్యులు డా. డి.గౌరీ శంకర్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో ‘అనాలసిస్‌ ఆఫ్‌ మోడీపైడ్‌ వాటర్‌ ఇండిసెస్‌ ఫర్‌ సర్ఫేస్‌ వాటర్‌ డిటెక్షన్‌ ఇన్‌ ల్యాండ్‌ సాట్‌ – 8 ఇమేజరీ’ అను అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వివరించారు. హర్షవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ డిగ్రీ రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

➡️