మార్పు కావాలిలో బాలగురువం బాబు

మార్పు కావాలిలో బాలగురువం బాబు

ఃమార్పు కావాలిఃలో బాలగురువం బాబుప్రజాశక్తి- నారాయణవనం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని సత్యవేడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు ఆరోపించారు. మంగళవారం ఆయన నారాయణవనం మండలంలో పలు గ్రామాలలో మార్పు కావాలి కాంగ్రెస్‌ రావాలి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా విధ్వంసకర పాలన కొనసాగుతుందని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గడచిన పది సంవత్సరాల నుండి నిరుద్యోగ సమస్య వెంటాడుతుందని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌, ప్రసాద్‌, బాబు, అల్లిముతు, దేశయ్యా, తదితరులు పాల్గొన్నారు.

➡️