సైబర్‌ బాధితునికి నగదు రిఫండ్‌

సైబర్‌ బాధితునికి నగదు రిఫండ్‌ప్రజాశక్తి – తిరుపతి సిటితిరుపతి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందిన కేవలం 20 నిమిషాల్లోనే స్పందించి రూ.1,42,545 లను బాధితునికి రీఫండ్‌ చేయించి న్యాయం చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సైబర్‌ పోలీసుల కథనం మేరకు… తిరుపతి లో కాపురముంటున్న రాజు తిరుమల లో విధులు నిర్వర్తిస్తున్నారు. 24వ తేది ఉదయం 11 గంటల ప్రాంతంలో ‘ఇండసింది కస్టమర్‌ కేర్‌ నుండి ఫోన్‌ చేస్తున్నాము… మీరు కెవైసి అప్‌డేట్‌ చేసుకోవాలి, లేకపోతే మీ క్రెడిట్‌ కార్డు ఎక్స్‌పైర్డ్‌ అవుతుంది’ అని చెప్పి, మీకు వచ్చిన ఓటీపీని చెప్పమన్నారు. అది నమ్మి అతను వెంటనే ఆలస్యం చేయకుండా ఓటీపీ చెప్పడంతో అతని క్రెడిట్‌ కార్డు నుండి రూ. 1,42,545 డెబిట్‌ అయ్యింది. అతను దిక్కుతోచని పరిస్థితులలో పోలీస్‌ గ్రౌండ్‌లో ఉన్న సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌ కి వచ్చి జరిగిన విషయం అంతటిని సైబర్‌ క్రైమ్‌ ఇన్స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌కు వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌ రాజు ఆదేశం మేరకు వెంటనే సైబర్‌ క్రైమ్‌ టీంను, అప్రమత్తం చేసి వెంటనే ఎన్‌ సిఆర్‌ పిలో కంప్లైంట్‌ రైజ్‌ చేసి, హౌసింగ్‌ .కామ్‌ నోడల్‌ ఆఫీస్‌ కి నోటీసును, మెయిల్‌ ద్వార సర్వ్‌ చేసి పర్సనల్‌ గా సైబర్‌ క్రైమ్‌ ఇన్స్పెక్టర్‌ ఫోన్లో సంబంధించిన నోడల్‌ ఆఫీసర్స్‌ తో మాట్లాడి ఫ్రాడస్టర్‌ బుక్‌ చేసిన ఆర్డర్స్‌ అన్ని కాన్సిల్‌ చేసి బాధితుని క్రెడిట్‌ కార్డుకి రూ.1,42,545/- అమౌంట్‌ ను 20 నిముషాల లోపల రిఫండ్‌ అయ్యేలా చేసి న్యాయం చేశారు. ఈ కేసును 20 నిమిషాల పరిష్కరించిన క్రైమ్స్‌ బందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

➡️