టిటిడి అటవీ కార్మికులకు న్యాయం చేయాలి 

Jan 29,2024 17:18 #Tirupati district
cpm support to ttd forest workers protest

ఆమరణ నిరాహార దీక్ష శిబిరం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్

ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అటవీ కార్మికులు పరిష్కారం కోసం తిరుపతి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో జరుగుతున్న నిరవధిక దీక్షలు మూడవ రోజుకు చేరాయి. సోమవారం దీక్షా శిబిరం వద్ద వారికి మద్దతు తెలియజేస్తూ చిత్తూరు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ టీటీడీలో అటవీ విభాగంలో పనిచేస్తూ పర్మనెంట్ చేయాలని రిలే దీక్షలు మూడు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నప్పటికీ పరిష్కారం కాకపోవడంతో కార్మికుల చేసి్న్న పోరాట స్ఫూర్తి అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం ప్రచారం చేసిది ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని.. మానవసేవే మాధవసేవ అని నిత్యం ప్రచారం చేస్తున్న యాజమాన్యం అటవీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోవడం దుర్మార్గం అన్నారు. గత బోర్డులు సమావేశంలో తీర్మానం అయినప్పటికీ దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో బోర్డు తీర్మానం అయినప్పుడు ఉన్న అధ్యక్షులు ప్రస్తుతం కూడా అధ్యక్షులుగా కొనసాగుతున్న అన్యాయమన్నారు. స్వార్థం కోసం సీనియర్లను పర్మినెంట్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్మిక సంస్థ టిటిడిలో ఇలాంటి అన్యాయాలు జరగడం బాధాకరమన్నారు. కార్మికులు ప్రాణ త్యాగానికి సిద్ధపడి దీక్షలు చేస్తున్నారని దీక్షలు మాన్పింపజేయాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న పోరాటానికి చివర వరకు చిత్తూరు జిల్లా సిపిఎం కమిటీ తరఫున అన్ని రకాల మద్దతు ఉంటుందని తెలియజేశారు.

➡️