కక్షపూరిత రాజకీయాలు చేయం : ఆరణి

కక్షపూరిత రాజకీయాలు చేయం : ఆరణి

కక్షపూరిత రాజకీయాలు చేయం : ఆరణిప్రజాశక్తి -తిరుపతిటౌన్‌తన హయాంలో కక్షపూరిత రాజకీయాలు చేయబోనని ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని 11వ డివిజన్‌ పరిధిలోని పెద్దకాపు లేవుట్‌ లో కల్వర్ట్‌ కమ్‌ సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. సోమవారం ఉదయం శ్రీనివాసం కాంప్లెక్స్‌ కు ఎదురుగా ఉన్న పెద్దకాపు లేవుట్‌ పరిధిలోని కల్వర్ట్‌ నిర్మాణం, 15 మీటర్ల సర్వీస్‌ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. పెద్దకాపు లేవుట్‌ సమస్యను టిడిపి 11వ డివిజన్‌ ఇన్చార్జీ కంకణాల రజనీకాంత్‌ నాయుడు, ఈతమాకుల హేమంత్‌ కుమార్‌, బిజేపి రాష్ట్ర అధికారప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, టిడిపి క్లస్టర్‌ ఇన్చార్జ్‌ పులుగోరు మురళీలు ఎమ్మెల్యే దష్టికి తీసుకొచ్చారు. దీంతో పెద్దకాపు లేవుట్‌ ను తిరుమల బైపాస్‌ రోడ్డును కలిపే సర్వీస్‌ రోడ్డు ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ డాక్టర్‌ శిరిషా, స్థానిక కార్పోరేటర్‌ ప్రవళ్లికా రెడ్డి, ఎస్‌ ఈ మోహన్‌ లతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కక్ష కట్టి పెద్దకాపు లేవుట్‌ కు సర్వీస్‌ రోడ్డు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. కల్వర్ట్‌లు పూర్తి చేయకుండా స్థానికులను, వ్యాపారవర్గాలను కరుణాకర్‌ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారనిఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడుల దష్టికి 22ఏ సమస్య తీసుకెళ్ళి పెద్దకాపు లేవుట్‌ వాసుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కక్షపూరిత రాజకీయలు తిరుపతిలో ఇకపై చెల్లవని అభివద్ధే అజెండా అని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే పర్యటనలో వైసిపి పార్టీకి చెందిన మేయర్‌ డాక్టర్‌ శిరీష హాజరవడం విశేషం .ఈ కార్యక్రమంలో ఎన్వీపసాద్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు నరసింహయాద్‌, మబ్బుదేవ నారాయణ రెడ్డి, జేబి శ్రీనివాస్‌, పొలకల మల్లిఖార్జున్‌, నవీన్‌ కుమార్‌ రెడ్డి, రాజా రెడ్డి పాల్గన్నారు.అన్నాక్యాంటిన్లను త్వరలో తెరుస్తాంనగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్లను త్వరలో తిరిగి తెరిపిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. అన్నా క్యాంటీన్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తూ పేదల పొట్ట కొట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో పున్ణప్రారంభించాలని నిర్ణయించడంతో సోమవారం మధ్యాహ్నం స్విమ్స్‌ ఎదరుగా ఉన్న అన్నా క్యాంటీన్‌ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. అన్నా క్యాంటిన్‌ స్థలంలో ప్రైవేట్‌ హోటల్‌ నిర్వహిస్తుండటమే కాకుండా నెహ్రూమున్సిపల్‌ హై స్కూల్‌ గ్రౌండ్‌ స్థలాన్ని కబ్జా చేసి హౌటల్‌ నడస్తుండటాన్ని గుర్తించారు. అన్నా క్యాంటీన్లను వెంటనే ఖాళీ చేయాలని లేకుంటే అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

➡️