‘పెర్టీ9 పెర్టీలిటీ సెంటర్‌’ను విస్తరింపజేస్తాం: డాక్టరు సునీత సాధు

'పెర్టీ9 పెర్టీలిటీ సెంటర్‌'ను విస్తరింపజేస్తాం: డాక్టరు సునీత సాధు

‘పెర్టీ9 పెర్టీలిటీ సెంటర్‌’ను విస్తరింపజేస్తాం: డాక్టరు సునీత సాధుప్రజాశక్తి-తిరుపతి సిటి దేశంలో మూడో అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ ఐవిఎఫ్‌ చైన్‌లలో ఒకటైన పెర్టీ9 పెర్టీలిటీ సెంటర్‌, తిరుపతి కేంద్రంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరింపజేస్తామని తిరుపతి కేంద్రం కన్సల్టెంట్‌ డాక్టరు సునీత సాధు తెలిపారు. తిరుపతిలో పెర్టి9 పెర్టీలిటీ సెంటర్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులుగా మారాలనే కలను నెరవేర్చుకోవడానికి తమ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. భవిష్యత్‌ పెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. రోగి కేంద్రీకృత సంరక్షణకు ప్రాధానత్య ఇస్తున్నామన్నారు. మరో కన్సల్టెంట్‌ డాక్టరు దీప్తి దామోదర మాట్లాడుతూ తిరుపతిలో పెర్టీ9పెర్టీలిటీ సెంటర్‌లో సాంకేతికత, రోగి అనుభవం రెండింటిపరంగా శ్రేష్టతకు ప్రాదాన్యత ఇస్తున్నామన్నారు.

➡️