రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు శంఖుస్థాపన

Mar 9,2024 13:11 #Tirupati district

టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఓల్డ్ వెంకటేశ్వర థీయోటర్ కు వెల్లే రహదారి వైపు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనుల నిర్మాణానికి శనివారం తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి ఎంపి డాక్టర్ మద్దిల గురుమూర్తి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణలు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రైల్వే గేట్ మూసివేసిన తర్వాత రైల్వే ట్రాక్ దాటుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల సూచనల మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఎంపీ నిధులు, తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో నిర్మాణం చేయనున్నారని తెలియజేశారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ రైల్వే గేటు మూసి వేసిన సమయంలో ఇక్కడ ధర్నాలు చేసిన సందర్బం ఉందని, రైల్వే కేసులు కూడా తమ నాయకులపై నమోదు అయిన విషయాన్ని గుర్తు చేసారు. గత దశాబ్ద కాలంగా స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంఖుస్థాపన చేయడం సంతోషాదాయకం అన్నారు. నగర అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలియజేశారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అంచనా మొత్తం 2 కోట్ల 17 లక్షలు కాగా, తిరుపతి ఎంపి నిధుల నుండి 75.8 లక్షలు కేటాయించగా, తిరుపతి నగరపాలక సంస్థ నిధుల నుండి 1 కోటి 41 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్ళూరి రత్నప్రసాద్, ఇతర కార్పొరేటర్లు కోటూరు ఆంజనేయులు, మురళీకృష్ణ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ భాష, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్, రైల్వే అధికారులు గుంతకల్ డివిజన్ డి.ఆర్.ఎం వినీత్ సింగ్, ఏడి.ఆర్.ఎం సుధాకర్, వైసిపి నాయకులు తాళ్ళూరి ప్రసాద్, మద్దాలి శేఖర్, అమరనాధ రెడ్డి, రాపూరి ప్రసాద్, నల్లాని బాబు, అమోస్ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️