టిటిడి ఆధ్వర్యంలో తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరణ

టిటిడి ఆధ్వర్యంలో తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరణప్రజాశక్తి – తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కాల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో తొలిసారిగా ముద్రించిన తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ 9న ఉగాది పర్వదినం పురస్కరించుకుని టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారన్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నరు, బెంగుళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంటుందన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలో కాల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. 29 మంది భక్తులు 38 సమస్యలను ఫోన్‌ ద్వారా ఈవోకు తెలియజేశారు.

➡️