పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ కాల్పులు విరమించాలి

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ కాల్పులు విరమించాలి

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ కాల్పులు విరమించాలి ప్రజాశక్తి -రేణిగుంట పాలస్తీనా పౌరులపై ఇజ్రాయిల్‌ సైన్యం జరుపుతున్న కాల్పులను విరమించాలని సీనియర్‌ జర్నలిస్టు రాఘవశర్మ అన్నారు. రేణిగుంట ఫ్లై ఓవర్‌కింద ‘రాజ్యాంగ పరిరక్షణ వేదిక’ ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సదస్సు ఆదివారం జరిగింది. రాఘవశర్మ మాట్లాడుతూ పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధంపై మానవాళి కలత చెందుతోందన్నారు. అమానవీయ మారణహోమాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజలు సొంత గడ్డపై శరణార్ధులుగా మారిపోవడం చూస్తుంటే ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టే పరిస్థితన్నారు. ఇజ్రాయిల్‌కు వెంటనే ఆయుధ సరఫరా ఆపి, సైనిక సంబంధాలను రద్దు చేసుకోవాలన్నారు. ఆవాజ్‌ నాయకులు దిలీప్‌బాషా ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఇజ్రాయిల్‌ దాడిలో మరణించిన పాలస్తీనావాసులకు సంతాపం తెలిపారు. పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఈ సదస్సులో జనవిజ్ఞాన వేదిక నాయకులు షరీఫ్‌, రఫీ, సత్యశ్రీ,, అమీర్‌ భాషా, హరినాథ్‌, రమణ తదితరులు ప్రసంగించారు.

➡️