టిడిపి × వైసిపిశ్రీ ఆర్‌పిలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశంశ్రీ నామినేషన్‌కు జనాల బాధ్యత వారిదేశ్రీ టిడిపి శ్రేణులు వీడియో తీశారని దాడి పుంగనూరులో ఇరు గ్రూపులూ పోలీసులకు ఫిర్యాదు

టిడిపి × వైసిపిశ్రీ ఆర్‌పిలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశంశ్రీ నామినేషన్‌కు జనాల బాధ్యత వారిదేశ్రీ టిడిపి శ్రేణులు వీడియో తీశారని దాడిశ్రీ పుంగనూరులో ఇరు గ్రూపులూ పోలీసులకు ఫిర్యాదు

టిడిపి × వైసిపిశ్రీ ఆర్‌పిలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశ నామినేషన్‌కు జనాల బాధ్యత వారిదేశ్రీ టిడిపి శ్రేణులు వీడియో తీశారని దాడిశ్రీ పుంగనూరులో ఇరు గ్రూపులూ పోలీసులకు ఫిర్యాదుప్రజాశక్తి – పుంగనూరు వలంటీర్లే కాదు, డ్వాక్రా సంఘాలతోనూ సమావేశాలు నిర్వహించరాదని తాజాగా ఎన్నికల కమిషన్‌ హుకుం జారీ చేసింది. అయితే పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌పిలతో మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సమావేశం కావడం ఉద్రిక్తతకు దారితీసి, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడం వరకూ వెళ్లింది. ఆర్‌పిలతో సమావేశమైన దృశ్యాలను టిడిపి శ్రేణులు తెలుసుకుని వీడియో తీయడంతో ఇరు గ్రూపులూ గొడవపడి చొక్కాలు చించుకునే స్థాయికి వెళ్లారు. స్థానికుల వివరాల మేరకు… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు జన సమీకరణ బాధ్యత పుంగనూరు మున్సిపాలిటీలో ఆర్పీలకు బాధ్యత కేటాయిస్తూ రహస్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దీనిని గమనించిన తెదేపా నాయకులు ఒకరు అక్కడికి వెళ్లి వీడియో తీస్తుండగా గమనించిన వైసిపి నాయకులు దాడి చేసి గాయపరిచారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమాన్ని కనీ విని ఎరుగని రీతిలోజన సమీకరణ చేసి విజయవంతం చేయాలని వైయస్సార్సీపి నిశ్చయించుకున్నట్లు సమాచారం. అయితే జన సమీకరణ బాధ్యత పుంగనూరు మున్సిపల్‌ కేంద్రంలో రిసోర్స్‌ పర్సన్‌ లకు అప్పగించి విజయవంతం చేసేందుకు వారి వారి ప్రయత్నాల్లో నిమగమయ్యారు. అందులో భాగంగానే రాష్ట్ర జానపద కళల అభివద్ధి చైర్మన్‌ కొండవీటి నాగభూషణం ఇంటిలో ఆర్పీలతో రహస్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ అనంతరం ఆర్పీలు ఒకరొకరే బయటకు వస్తుండగా ఈ సంఘటనను ముందుగా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వారు వీడియోలు ఫోటోలు తీసేందుకు అక్కడ కాపు కాసారు. ఆర్పీలు వస్తున్న దశ్యాలను వీడియోలు, ఫోటోలు తెలుగుదేశం పార్టీకి చెందిన హేమాద్రి తీస్తుండగా ఇది గమనించిన వైఎస్‌ఆర్సిపి నాయకులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేసి పట్టుకున్నారు. అతన్ని నాగభూషణం ఇంటిలోకి తీసుకెళ్లి చితకబాదారు. వారి వద్ద నుంచి అతను తప్పించుకుని వెళ్లి అక్కడ జరిగిన సంఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలపడంతో పట్టణ నాయకులు అందరూ అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు టిడిపి నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసిపి నాయకులు రాష్ట్ర జానపద సజనాత్మక కళాభివద్ధి చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జింక వెంకట చలపతి, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అమ్ము, సాయి, ఇర్ఫాన్‌, ప్రభు, అమ్ముకుట్టి, తుంగ మంజు లపై తెలుగుదేశం పార్టీకి చెందిన చెందిన హేమాద్రి ఫిర్యాదు చేశారు. తనను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి కొట్టి గాయపరిచి తన వద్ద ఉన్న సెల్‌ ఫోను, చైన్‌ లాక్కున్నారని, డ్రగ్స్‌ ప్యాకెట్లు ఇచ్చి టిడిపి వాళ్లు వ్యాపారం చేయమని చెప్పాలని తనపై ఒత్తిడి చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. టిడిపి నాయకులు సివి రెడ్డి, గిరి, సయ్యద్‌ సుహేర్‌బాష, ఎం.నాగరాజు, సుబ్రమణ్యం రాజు హేమాద్రికి అండగా నిలిచారు. అయితే హేమాద్రిపైన వైసిపి నాయకులు ఓ మహళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినట్లు సిఐ రాఘవరెడ్డి మీడియాకు తెలిపారు.

➡️