జర్నలిస్టు సమాజానికి రుణపడి ఉంటా: ఎంఎల్‌ఎ

జర్నలిస్టు సమాజానికి రుణపడి ఉంటా: ఎంఎల్‌ఎ

జర్నలిస్టు సమాజానికి రుణపడి ఉంటా: ఎంఎల్‌ఎ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)జర్నలిస్టుగా సమాజంలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసిన తనకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సీఎం నారా చంద్రబాబునాయుడుకు, పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు, జర్నలిస్టులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సీనియర్‌ జర్నలిస్ట్‌, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ప్రెస్‌ క్లబ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌ కు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌ మాట్లాడుతూ 22 ఏళ్లుగా జర్నలిస్టుగానే ఉంటూ తనకున్న చిరకాల వాంఛ శాసనసభ్యుడి కలను నేటికి నెరవేర్చుకోగలిగానన్నారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తనకు సుపరిచితులని, ఎన్నో ఏళ్లుగా తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ కు సొంత భవన నిర్మాణానికి స్థల కేటాయింపుకు, జర్నలిస్టులకు హౌస్‌ సైట్లను ప్రభుత్వం కేటాయింపజేసేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్‌ రెడ్డి, బాలచంద్ర, కోశాధికారి శ్రీకాంత్‌, ప్రజాశక్తి సిబ్బంది శ్రీనివాసులు, సురేష్‌, విలేఖరి గౌస్‌ బాషా ప్రత్యేకంగా అభినందించారు.

➡️