Jun 14,2024 23:53
గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగంప్రజాశక్తి-తిరుపతి సిటి గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆలయంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేేగారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, గార్డెన్‌ మేనేజర్‌ జనార్దన్‌ రెడ్డి, ఏఇవో ముని కష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ మోహన్‌ రావు, టెంపుల్‌ ఇన్స్పెక్టర్‌ ధనంజయ, భక్తులు పాల్గొన్నారు.

➡️