వామపక్షాలను కలిసిన పోతుగుంట రాజేష్‌

వామపక్షాలను కలిసిన పోతుగుంట రాజేష్‌

వామపక్షాలను కలిసిన పోతుగుంట రాజేష్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఇండియా కూటమి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌ నాయుడు వామపక్షాల నేతలను వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి గెలుపుకు అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు సమాలోచించారు. దేశాన్ని నాశనం చేసిన బీజేపీ, దాని మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన, రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని.. దేశ సమగ్రతను కాపాడే ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో రాజేష్‌ గెలుపే లక్ష్యంగా వామపక్షాలన్నీ ఒక్కటవుతాయనీ, త్వరలో ఇండియా కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల్లో ముందుకెళతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య తెలిపారు. అదేవిధంగా రాజేష్‌ నాయుడు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు డాక్టర్‌ బత్తెయ్యనాయుడు, అన్నపూర్ణమ్మను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కూడగట్టారు.

➡️