ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌కలెక్టర్‌ , జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌కలెక్టర్‌ , జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌కలెక్టర్‌ , జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్‌ ఫెషిలిటేషన్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగిందని, జిల్లాలో ఓటుహక్కు కలిగి ఎన్నికల విధుల్లో ఉన్న వారు మే 1 నాటికి ఫారం 12లో దరఖాస్తు చేసుకోలేకపోయి, సంబంధింత నియోజకవర్గంలో ఓటు నమోదు గల వారికి నియోజకవర్గ ఫెసిలిటెషన్‌ సెంటర్‌ నందు మే 7,8 తేదీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సౌకర్యం ఎన్నికల కమిషన్‌ కల్పించిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వర్తించే సిబ్బందికి, పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్‌ తదితర ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి, అత్యవసరశాఖలో పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖలు, పోలింగ్‌ విధులకు హాజరయ్యే మీడియా వారికి అథారిటీ లెటర్‌ మేరకు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లకు ఈ ఆదివారం మే5 న జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నేటి నుంచి ప్రారంభమైందని అలాగే ఎలక్షన్‌ విధులలో ఉండి ఇతర జిల్లాల ఓటర్లకు కూడా జిల్లా ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటింగ్‌ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగనున్నదని, 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌ సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాలని రిటర్నింగ్‌ అధికారులకు కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. రేపు మే 6న కూడా ఫెసిలిటెషన్‌ కేంద్రంలో తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్‌ ఫెషిలిటేశన్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. ఉదయం ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం హుమనిటీస్‌ బ్లాక్‌ 1లో ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఎస్వీ క్యాంపస్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా ఫెసిలిటేశన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అంతే కాకుండా జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధుల్లో ఉన్న వారు మే 1 నాటికి ఫారం 12 నందు దరఖాస్తు చేసుకోలేకపోయి, సంబంధింత నియోజక వర్గంలో ఓటు నమోదు గల వారికి నియోజక వర్గ ఫెసిలిటెషన్‌ సెంటర్‌ నందు మే7,8 తేదీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కొరకు సిఈఓ కార్యాలయం, విజయవాడ వారు అవకాశం కల్పించారని ఆ మేరకు ఆదేశాలు అందాయని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కొరకు దరఖాస్తు చేసుకున్న కొందరికి కొన్ని కారణాల చేత తిరస్కరించబడిన వారు కూడా 7, 8 తేదీలలో ఈ ఓటింగ్‌ సౌకర్యం వినియోగించు కోగలరని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్‌ ఫెసిలిటెషన్‌ కేంద్రంలో తాగునీరు, షేడ్‌, మజ్జిగ, ఫ్యాన్‌ తగినంత ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవిఎంల ప్రిపరేషన్‌ కమిషనింగ్‌ ప్రక్రియ సంబంధిత ఆర్‌ఓలు, జనరల్‌ అబ్జర్వర్‌ పర్యవేక్షణలో బెల్‌ ఇంజనీర్ల సహకారంతో పార్టీల అభ్యర్థుల సమక్షంలో నిర్వహించడం ప్రారంభం అయిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పూర్తి చేసేలా, పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఆదివారం సాయంత్రం నుండి భద్రత నడుమ రేణిగుంట ఈవిఎం గోడౌన్‌ నుండి తీసుకెళ్లాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో పార్లమెంటు ఈవిఎం కమిషనింగ్‌ ప్రారంభించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఏమైనా సమస్యలుంటే సత్వరమే తన దష్టికి తేవాలని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు, మీడియా వారికి వివరించాలని సూచించారు.పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలింగ్‌ 1506పుంగనూరు: ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నియోజకవర్గంలో 2062 ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి మధుసూదన్‌ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక బసవరాజ హైస్కూల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే పోస్టల్‌ బ్యాట్‌ ఓటింగ్‌ మొదటిరోజు 1506 ఓట్లు పోలింగ్‌ జరిగినట్లు ఆర్‌ఓ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న 972 మంది ఉద్యోగులుగూడూరు టౌన్‌: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లో 972 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ చిత్తూరుఅర్బన్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ను ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతంగా వినియోగించుకుంటున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటన్నింగ్‌ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల 2024లో భాగంగా స్థానిక పివికెఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 7 పోలింగ్‌ కేంద్రాలలో పిఓలు, ఏపిఓలు, ఓపిఓలు, మైక్రో అబ్జర్వర్లు పోలీస్‌ ఆర్టీసీ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ఓలు డాక్టర్‌ జె.అరుణ, శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు.ఈవిఎంల కమిషనింగ్‌ ప్రక్రియ పరిశీలన తిరుపతి టౌన్‌: తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్‌ రూంలో అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్‌ను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం 23 – తిరుపతి (ఎస్‌సి) పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌ సమక్షంలో జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గ ఈవిఎం కమిషనింగ్‌ను పరిశీలించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ 274 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల బ్యాలెట్‌ యూనిట్‌కి ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ను సెట్‌ చేసేందుకు 40 టేబుల్‌ల ఏర్పాటుతో బెల్‌ ఇంజనీర్లు, సిబ్బంది కలిసి కమిషనింగ్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఉదయం నుండి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 167- తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారిణి అదితి సింగ్‌

➡️