భూహక్కు చట్టం రద్దుతో ఆస్తులకు రక్షణ : ఆరణి

భూహక్కు చట్టం రద్దుతో ఆస్తులకు రక్షణ : ఆరణి

భూహక్కు చట్టం రద్దుతో ఆస్తులకు రక్షణ : ఆరణిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఎపి భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీ భూహక్కు చట్టాన్ని రద్దు చేయడం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించినట్లయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గోపీచంద్‌, మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, డాక్టర్‌ హరిప్రసాద్‌, వూకా విజరుకుమార్‌, చినబాబు, బుల్లెట్‌ రమణ పాల్గొన్నారు.

➡️