కేంద్ర మంత్రులను కలిసిన రామిరెడ్డి

Jun 13,2024 22:56
కేంద్ర మంత్రులను కలిసిన రామిరెడ్డి

ప్రజాశక్తి-క్యాంపస్‌: నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులను ఉన్నత విద్యాసంస్థల అధ్యాపక సంఘం అధ్యక్షులు ప్రొ.వైవి రామిరెడ్డి గురువారం ఢిల్లీలో ఏపీశాఖ తరఫున కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, భూపతి రాజు శ్రీనివాస వర్మని కలిసి అభినందనలు తెలిపారు. వారిని రామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీల మేరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాల యాలు, ఉన్నత విద్యా సంస్థల అభివద్ధికి నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు.

➡️