నేడు, రేపు షర్మిల పర్యటన

నేడు, రేపు షర్మిల పర్యటన

నేడు, రేపు షర్మిల పర్యటనప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎపిపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచార నేపథ్యంలో బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తిలో ర్యాలీ నిర్వహించనున్నారు. బేరివారి మండపం వద్ద ఉదయం 10 గంటలకు ఎన్నికల సభలో మాట్లాడతారు. శ్రీకాళహస్తిలో పర్యటన ముగించుకుని సత్యవేడు నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు. అక్కడనుంచి నగిరికి చేరుకుని సాయంత్రం సభలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి తిరుపతిలో బస చేస్తారు. సోమవారం ఉదయం జీడీనెల్లూరు, మధ్యాహ్నం చిత్తూరు, సాయంత్రం పలమనేరుల్లో సభల్లో పాల్గొంటారు.

➡️