మానవ సేవయే మాధవ సేవ

Feb 2,2024 15:32 #Tirupati district
sriramakrishna maatam food service

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : స్వామి వివేకానంద 162 వ జయంతిని.పురస్కరించుకొని శ్రీ రామకృష్ణ మఠం మరియు పుత్తూరు విశ్రాంత ఉద్యోగుల సంఘం సమిష్టి సహకారం తో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేయడమైనది. విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రాజు మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం రామకృష్ణ మఠం. విశ్రాంతి ఉద్యోగుల సంగం సహకారంతో పేదలకు సహాయం అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం కార్యదర్శి కటారి ముని కృష్ణయ్య, విశ్రాంత సంఘం, సభ్యులు కృపావరమ్మ యుగంధర్ రాజు, రవిశంకర్, కుప్పయ్య, రామమూర్తి రాజు, అరుణాచల రెడ్డి, మార్టిన్, మేకల సుబ్రమణ్యం ,మురళి రాధాకృష్ణ మరియు వైద్యులు డాక్టర్ కృష్ణ కాంత్, డాక్టర్ పల్లవి , హెడ్ నర్సు దిల్ షాద్ పాల్గొన్నారు.

➡️