సప్తగిరి సంగీత సప్తాహం ప్రారంభం

సప్తగిరి సంగీత సప్తాహం ప్రారంభం

సప్తగిరి సంగీత సప్తాహం ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి సిటిసప్తగిరి సంగీత సప్తాహం పేరుతో 24 గంటలు నిరంతరాయంగా వారం రోజులపాటు తలపెట్టిన కార్యక్రమం ఆదివారం సంగీత కచేరిలతో ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై.. తిరుపతి కి చెందిన సంగీత విద్వాంసులు .. ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్‌ గాత్ర విద్వాంసులు సంగీత గ్రంథకర్త ఎస్వి సంగీత కళాశాల విశాంత ప్రిన్సిపాల్‌ కొమాండూరు శేషాద్రి సంగీత కచేరి, అనంతరం ప్రపంచ ప్రఖ్యాత డోలు విధ్వాంసులు ఎస్వి నాదస్వర పాఠశాల అధ్యాపకులు వైయల్‌ శ్రీనివాసులు , వైఎల్‌ హరిబాబు బందం చే మంగళ ధ్వని నిర్వహించారు. డాక్టర్‌ కొల్లూరు వందన గాత్రం చేయగా, ఆముదాలవలసకు చెందిన డాక్టర్‌ మావుడురి సత్యనారాయణ శర్మ చే వయోలిన్‌, కోటిపల్లి రమేష్‌ మదంగం హనుమంతరావు చే ఘట్టం .. అదేవిధంగా చిన్నమ్మ దేవి చే గాత్రం.. ధీరజ్‌ చే వయోలిన్‌.. ధర్మారావుచే మదంగం , రామకష్ణచే ఘట్టం.. ఇలా అనేక బందాలచే గాత్ర కచేరీలు ఘనంగా అందరినీ ఆకట్టుకున్నాయి. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగనుంది.

➡️