ఈఏపిసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

Jun 13,2024 22:53
ఈఏపిసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-గూడూరు టౌన్‌: ఈఏపిసెట్‌ ఫలితాల్లో పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. గురువారం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ శ్రీ శివాని స్టడీ సర్కిల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయం అన్నారు. స్టడీ సర్కిల్‌ కరస్పాండెంట్‌ శివకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ అన్వేష్‌ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 7247వ ర్యాంక్‌, ఎస్‌వీ యూనివర్సిటీ పరిధిలో 1194వ ర్యాంక్‌, సుష్మ రాష్ట్ర స్థాయిలో 8835వ ర్యాంక్‌, ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో 1551వ ర్యాంక్‌, విష్ణువర్ధన్‌ రాష్ట్ర స్థాయిలో 9136వ ర్యాంక్‌ సాధించారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో 10వేల లోపు 3ర్యాంక్‌లు, 20వేల లోపు 6ర్యాంక్‌లు, 25వేల లోపు 14ర్యాంక్‌లు, 35వేల లోపు 39ర్యాంక్‌లు, 50వేల లోపు 75ర్యాంక్‌లు మొత్తం 152మంది ర్యాంక్‌లు సాధించారన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, కమలాకర్‌, మునిరాజా, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️