మా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి  

Dec 20,2023 17:44 #Tirupati district
tpt anganwadi workers strike on 9th day s3

ప్రజాశక్తి-గూడూరు : అంగన్వాడిల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మె తిరుపతి జిల్లా గూడూరులో బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. శిబిరం వద్దకు వచ్చి ఆశ వర్కర్స్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.ఉష, కమిటి సభ్యులు కె.జానకి, పి. సూర్యావతి, ఎస్.కె.రఫియ, పి.గురవమ్మ అమరావతి, ఈ.హెలెన్, భవన నిర్మాణ కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్టా శంకరయ్య, గుర్రం రమణయ్య, పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వము అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. సి.ఐ.టి.యు నాయకులు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా ఆకలి దప్పులతో శిబిరంలో కూర్చొని నిరవధిక సమ్మె చేస్తుంటే వారి సమస్యలపై రాష్ట్రంలోని జగన్ సర్కార్ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారి న్యా య పరమైన సమస్యలు వెంటనే తీర్చాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, పట్టణ సి.ఐ.టి.యు.అధ్యక్షులు బి.వి.రమణయ్య, కార్యదర్శి యస్.సురేష్, పామంజి మణి, ఏ.ప్రసాద్, సెక్టార్ లీడర్స్ ఎం. అరుణ, లక్ష్మి, ముని కుమారి, ఈ. పెంచలమ్మ, మంగమ్మ, సుబ్బమ్మ, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

➡️